ముగించు

మందస పాలకోవా

రకం:   భోజనం తర్వాత వడ్డించే పదార్థాలు
మందస కోవా ఫోటో

సాధారణంగా కోవా అనగానే మనకు గుర్తుకు వచ్చేది కోవా బిళ్ళలు, లేదా కోవా ముద్ద.
కానీ మందస పాలకోవాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ద్రవరూపంలో మాధుర్యాన్ని పంచుతూ గమ్మత్తైన రుచిని కలిగి ఉంటుంది.

మందస తూర్పు కనుమల ముంగిట నిలిచిన ఒకప్పటి కళింగ రాజుల సంస్థానం. నాటి నుండి విభిన్న రుచులతో ఆహార పదార్ధాలు తయారుచేసే ప్రాశస్త్యం కలిగి ఉన్నది. అందులో భాగంగా పేరెన్నికగన్నది మందస ఔషధ పాలకోవా.

దీనికి దాదాపు 300 ఏళ్ల చరిత్ర ఉందని తెలుస్తోంది. తూర్పు కనుమలు అనేక ఔషధ మొక్కలకు, చెట్లకు నిలయమై విలసిల్లుతున్నాయి. ఈ ప్రాంతంలోని గోవులన్నింటినీ ప్రతిరోజూ ఆ కొండలలో కే మేతకు తీసుకు వెళతారు ఔషధ గుణాలు కలిగిన మొక్కలను తినడం వలన అవి ఇచ్చే పాలు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అందువలననే మందస కోవాకు అంతటి ప్రసిద్ధి.

గ్రామంలో దాదాపు 10 కుటుంబాలు కోవా తయారీయే వృత్తిగా చేసుకొని తరతరాలుగా జీవిస్తున్నాయి. సాధారణ కోవా తయారీ మాదిరిగానే పాలు, పంచదారతో ఈ కోవాను తయారు చేస్తారు. అయితే దానికి ముద్ద రూపం రాకముందే తీసి విక్రయానికి సిద్ధం చేస్తారు. ఇలా చేయడం వలన ఆ పాలలోని ఔషధగుణాలు భద్రంగా ఉంటాయని తయారీదారుల చెప్తుంటారు.

గమ్మత్తయిన రుచి ఈ కోవకు సొంతం. శీతాకాలం, వర్షా కాలంలో దాదాపు 15, 20 రోజుల పాటు ఈ ద్రవరూప కోవా పాడైపోకుండా ఉంటుంది.

ఈ ఔషధ గుణకోవాను స్థానికులు విరివిగా కొని తింటుంటారు.సాధారణంగా తీపి పదార్ధాలు తింటే షుగర్ వస్తుంది అని అనుకుంటాం కానీ ఈ కోవా వలన ఎటువంటి సమస్య ఉండదు.