కుల ధృవీకరణ ప్రత్రము
సంఘటిత కుల ధృవీకరణ పత్రము (కుల జాతీయత, పుట్టినతేది)
యస్.సి, యస్.టి, బి.సి. మరియు ఓ.సి. కులాలకు చెందిన వారికి సంఘటిత కుల ధృవీకరణ పత్రములు జారీ చేయుదురు.
ఈ ధృవీకరణ పత్రములు విద్య మరియు ఉద్యోగ విషయములలో ఉపయోగించు కొనవచ్చును.
దరఖాస్తుకు చేయుటకు కావలసిన పత్రములు:
- ధరఖాస్తు/ అప్లికేషన్.
- కుటుంబ సభ్యులలో ఎవరికైనా జారీ చేయబడిన కుల ధృవీకరణ పత్రము.
- పదవ తరగతి మార్కుల జాబితా / పుట్టిన తేదీ / బదిలీ పత్రము.
- ఒకటవ తరగతి నుండి పదవతరగతి వరకు గల అధ్యయన ధృవపత్రము /గ్రామ పంచాయితీ గాని పురపాలక సంఘము చే జారీ చేయబడిన జనన ధృవీకరణ పత్రము.
- రేషన్ కార్డ్ /ఓటరు కార్దు /ఆధార్ కార్డు.
- షెడ్యులు I నుండి IV
సదరు పేర్కొనిన సేవను ధరఖాస్తు పొందే వరకు “బి” కేటగిరి నందు పొందిన తరువాత ‘ఎ’ కేటగిరి గాను పరిగణించబడును.
పై విధముగా పౌరుడు (ఆతను/ఆమె) తనకు అవసరమైన ధృవపత్రము పొందవచ్చును. మనము తన ధరఖాస్తు యొక్క పరిస్థితిని క్రింది సూచించిన అంతర్జాల చిరునామా లో చూడవచ్చును.
పర్యటన: http://ap.meeseva.gov.in/deptportal/UserInterface/LoginForm.aspx
మరిన్ని వివరాలకు సంప్రదించండి:
ప్రాంతము : దగ్గర లోని మీసేవా కేంద్రము | నగరం : శ్రీకాకుళం | పిన్ కోడ్ : 532001